సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 24, 2020 , 22:28:00

KXIP vs SRH: వార్నర్‌, బెయిర్‌స్టో ఔట్‌

KXIP vs SRH: వార్నర్‌, బెయిర్‌స్టో  ఔట్‌

దుబాయ్‌: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్(35)‌ పవర్‌ప్లేలో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి సన్‌రైజర్స్‌ 52 పరుగులు సాధించింది.  భారీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న జోడీని   రవి బిష్ణోయ్‌  విడదీశాడు.  ఏడో ఓవర్లో   రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా బంతి గ్లోవ్స్‌కు తగలడంతో వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

ఆ తర్వాతి ఓవర్లోనే మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో(19) బౌల్డ్‌  అయ్యాడు. ప్రస్తుతం మనీశ్‌ పాండే, అబ్దుల్‌ సమద్‌ క్రీజులో ఉన్నారు. సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో వికెట్‌ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతున్నారు.   8 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.