శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 08, 2020 , 21:08:04

SRH vs KXIP: ప్చ్‌.. బెయిర్‌స్టో 97 ఔట్‌

SRH vs KXIP: ప్చ్‌.. బెయిర్‌స్టో  97 ఔట్‌

దుబాయ్:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(97: 55 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) శతకానికి చేరువలో ఔటయ్యాడు.  యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ వేసిన 16వ ఓవర్లో హైదరాబాద్‌ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఓవర్‌ మొదటి బంతికి డేవిడ్‌ వార్నర్(52)‌..మాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగ్గా.. సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టిన బెయిర్‌స్టో నాలుగో బంతికి ఎల్బీడబ్లూగా పెవిలియన్‌ చేరాడు.

నాలుగు బంతుల వ్యవధిలో కుదురుకున్న ఓపెనర్లను బిష్ణోయ్‌ ఔట్‌ చేసి భారీ భాగస్వామ్యానికి తెరదించాడు.  తొలి వికెట్‌కు ఓపెనింగ్‌ జోడీ 92 బంతుల్లో 160 రన్స్‌ రాబట్టింది.   సీజన్‌ ఆరంభం నుంచి తడబడిన బెయిర్‌స్టో  ఈ మ్యాచ్‌తో   తన బ్యాట్‌ పవర్‌ ఏంటో మరోసారి చూపించాడు.  మొదటి నుంచి   ఆత్మవిశ్వాసంతో కనిపించిన బెయిర్‌స్టో   కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  చక్కటి స్ట్రోక్‌ ప్లేతో అలరించిన  బెయిర్‌స్టోకు  బంతులు వేసి వేసీ  పంజాబ్‌  బౌలర్లు అలసిపోయారు.