బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 29, 2020 , 22:19:38

DCvSRH: తొలి ఓవర్‌లోనే ఢిల్లీకి షాక్‌

DCvSRH: తొలి ఓవర్‌లోనే ఢిల్లీకి షాక్‌

అబుదాబి:  ఐపీఎల్‌-13లో భాగంగా  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 163  పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన  తొలి ఓవర్‌లోనే    ఓపెనర్‌ పృథ్వీ షా కీపర్‌  బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే  ప్రయత్నం చేశాడు.

స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ ఔటవడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది.  8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ  2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.   ప్రస్తుతం పంత్‌, ధావన్‌(22) క్రీజులో ఉన్నారు.  ఢిల్లీ విజయానికి 72 బంతుల్లో 120  పరుగులు చేయాల్సి ఉంది.  logo