శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 20:54:38

ఆరెంజ్‌ ఆర్మీలో చేరిన అఫ్గాన్‌ స్టార్లు!

ఆరెంజ్‌ ఆర్మీలో చేరిన అఫ్గాన్‌ స్టార్లు!

దుబాయ్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో  పాల్గొన్న కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో  సత్తాచాటేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీపీఎల్‌ ముగియడంతో ఆ లీగ్‌లో పాల్గొన్న పలువురు క్రికెటర్లు  ఆయా జట్లతో   కలిసేందుకు యూఏఈ  చేరుకుంటున్నారు.   తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్గనిస్థాన్‌ స్టార్‌ ప్లేయర్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ యూఏఈలో ఉన్న ఆ జట్టు క్యాంప్‌లో చేరారు.   ఈ ఇద్దరు కూడా ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో   ఉంటారు.

క్వారంటైన్‌ సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తామని చెప్పారు.  ఈ ఆరు రోజుల్లో  ‌ ఆటగాళ్లకు మూడు సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మూడింటిలోనూ ఫలితం నెగెటివ్‌గా తేలితే తమ సహచరులతో కలిసి శిక్షణలో పాల్గొనడానికి వీరికి  అనుమతి ఉంటుంది.


logo