బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 24, 2020 , 21:30:57

తడబడిన పంజాబ్‌..సన్‌రైజర్స్‌ లక్ష్యం 127

తడబడిన పంజాబ్‌..సన్‌రైజర్స్‌ లక్ష్యం 127

దుబాయ్:‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నికోలస్‌ పూరన్‌(32 నాటౌట్:‌ 28 బంతుల్లో 2ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌(27), క్రిస్‌ గేల్‌(20) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు.  ఆఖర్లో పూరన్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయడంతో పంజాబ్‌    గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ(2/29), జేసన్‌ హోల్డర్‌(2/27), రషీద్‌ ఖాన్‌(2/14) తలో రెండు వికెట్లు పడగొట్టి  పంజాబ్‌ను దెబ్బకొట్టారు.  మన్‌దీప్‌ సింగ్‌(17), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(12), దీపక్‌ హుడా(0) చేతులెత్తేశారు.  డెత్‌ ఓవర్లలో ప్రమాదకర పూరన్‌ను హైదరాబాద్‌ అద్భుతంగా కట్టడి చేసింది.  అతడు స్వేచ్ఛగా షాట్లు ఆడకుండా పదునైన బంతులతో బెంబేలెత్తించారు.