శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 13, 2020 , 01:47:07

ఆంధ్ర 237/1

ఆంధ్ర 237/1

ఒంగోలు: ఓపెనర్లు విజృంభించడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. ప్రశాంత్‌ కుమార్‌ (296 బంతుల్లో 117 బ్యాటింగ్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకంతో కదంతొక్కితే.. జ్ఞానేశ్వర్‌ (73) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 94 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 237 పరుగులు చేసింది. హైదరాబాద్‌ ఏస్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ గైర్హాజరీలో మనవాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో.. రోజంతా ఆడిన ఆంధ్ర జట్టు కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 13/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగింది. పసలేని హైదరాబాద్‌ బౌలింగ్‌ను ఓపెనర్లిద్దరూ ఓ ఆటాడుకున్నారు. తొలి వికెట్‌కు 159 పరుగులు జోడించాక జ్ఞానేశ్వర్‌ ఔటైనా.. ఆ తర్వాత కెప్టెన్‌ హనుమ విహారి (41 బ్యాటింగ్‌) నిలకడ కనబర్చడంతో ఆంధ్ర మరో వికెట్‌ కోల్పోకుండా ఆట ముగించింది.


logo