బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 00:27:52

సౌరాష్ట్ర 206/5

 సౌరాష్ట్ర 206/5

రాజ్‌కోట్‌: సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్‌ అవి బారోత్‌(54), విశ్వరాజ్‌ జడేజా(54) అర్ధశతకాలు చేసినా.. చివర్లో పేసర్‌ అక్ష్‌దీప్‌(3/41) చెలరేగడంతో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ ఫైనల్లో  బెంగాల్‌ పైచేయి సాధించింది. సోమవారం ఇక్కడ జరిగిన తుదిపోరు తొలి రోజు ఆటలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌరాష్ట్ర  తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 206పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అర్పిత్‌(29నాటౌట్‌) ఉన్నాడు. ఓపెనర్‌ హర్విక్‌ దేశాయ్‌(38) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్‌ అవి బారోత్‌ నిలకడగా ఆడి అర్ధశతకం తర్వాత అక్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన విశ్వరాజ్‌(54) కూడా హాఫ్‌ సెంచరీ చేయడంతో ఓ దశలో సౌరాష్ట్ర రెండు వికెట్లకు 163 పరుగులతో పటిష్ఠంగా నిలిచింది. ఆ తర్వాత విశ్వరాజ్‌ సహా షెల్డన్‌ జాక్సన్‌(14) త్వరగా ఔటయ్యారు. అనంతరం టీమ్‌ఇండియా టెస్టు ఓపెనర్‌ చతేశ్వర్‌ పుజారా(5) బరిలోకి దిగినా గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్‌ కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే మంగళవారం ఆటకు పుజారా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, ఫైనల్‌ జరుగుతున్న సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం మైదానం పిచ్‌ నాసిరకంగా ఉందని బెంగాల్‌ కోచ్‌ అరుణ్‌ లాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 


logo
>>>>>>