బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 15, 2020 , 01:21:15

హైదరాబాద్‌కు మరో ఓటమి

హైదరాబాద్‌కు మరో ఓటమి

ఒంగోలు: హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో కేరళపై గెలిచి గాడిలో పడ్డట్లు కనిపించిన హైదరాబాద్‌ జట్టు మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 96 పరుగుల భారీ తేడాతో ఓడి, ఈ సీజన్‌లో నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్‌ చివరి రోజైన మంగళవారం ఆంధ్ర బౌలర్లు విజయ్‌ కుమార్‌ (5/25), పృథ్వీరాజ్‌ (3/53) చెలరేగడంతో హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే కుప్పకూలింది. రవితేజ (72 నాటౌట్‌) చివరి వరకు ఒంటరిగా పోరాడగా.. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (41) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.


logo