శనివారం 29 ఫిబ్రవరి 2020
ఫజల్‌ అజేయ సెంచరీ

ఫజల్‌ అజేయ సెంచరీ

Feb 13, 2020 , 23:46:27
PRINT
 ఫజల్‌ అజేయ సెంచరీ
  • విదర్భ 242/4 హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌ (126 బ్యాటింగ్‌; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో విదర్భ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్నది. కెప్టెన్‌తో పాటు గణేష్‌ సతీశ్‌ (65) రాణించడంతో గురువారం ఆటముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో రవికిరణ్‌ 2, సిరాజ్‌, అనికేత్‌ రెడ్డి చెరో వికెట్‌ పడగొట్టారు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న విదర్భ.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 30 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఫజల్‌తో పాటు అక్షయ్‌ వాడ్కర్‌ (9) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 239/7తో రెండో రోజు మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ చివరకు 272 పరుగులకు ఆలౌటైంది. ప్రతీక్‌ రెడ్డి (83) క్రితం రోజు స్కోరుకు 7 పరుగులు జతచేయగా.. మెహదీ హసన్‌ (30), మహమ్మద్‌ సిరాజ్‌ (22) విలువైన పరుగులు జోడించారు.


logo