శనివారం 28 మార్చి 2020
Sports - Feb 29, 2020 , 00:27:51

నేటి నుంచి రంజీ సెమీఫైనల్స్‌

 నేటి నుంచి రంజీ సెమీఫైనల్స్‌

కోల్‌కతా: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌కు వేళైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్స్‌లో బెంగాల్‌తో కర్ణాటక.. గుజరాత్‌తో సౌరాష్ట్ర తలపడనున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి నిలకడైన ప్రదర్శన కొనసాగించిన ఈ నాలుగు జట్లు తుదిపోరుకు చేరేందుకు అడుగుదూరంలో నిలిచాయి. గత పదమూడేండ్లలో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరలేకపోయిన బెంగాల్‌ జట్టు.. సెమీస్‌లో పటిష్ఠ కర్ణాటకతో తలపడనుంది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపిన లోకేశ్‌ రాహుల్‌.. అందుబాటులో ఉండ టం కర్ణాటక బలాన్ని రెట్టింపు చేస్తున్నది.  సెమీస్‌లో పార్థివ్‌ పటేల్‌ సారథ్యంలోని గుజరాత్‌తో జైదేవ్‌ ఉనాద్కత్‌ కెప్టెన్సీలోని సౌరాష్ట్ర అమీతుమీ తేల్చుకోనుంది. 


logo