గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 31, 2020 , 02:12:34

రాణి రాంపాల్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

రాణి రాంపాల్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌కు ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్‌ గేమ్స్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు దక్కింది. ఈ అవార్డు కైవసం చేసుకున్న ప్రపంచంలోనే తొలి హాకీ ప్లేయర్‌గా రాణి చరిత్ర సృష్టించింది. 20 రోజుల అభిమానుల ఓటింగ్‌ తర్వాత ఫలితాలను వరల్డ్‌ గేమ్స్‌ గురువారం ప్రకటించింది. 1,99,477 ఓట్లు దక్కించుకున్న రాణి రాంపాల్‌... 2019కు గాను రాణి రాంపాల్‌కు అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికైనట్టు వెల్లడించింది. గతేడాది ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌లో సత్తాచాటిన రాణి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచింది. భారత జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించింది.


logo