శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 06, 2020 , 00:51:14

రాఖీకి స్వర్ణం

రాఖీకి స్వర్ణం

కోల్‌కతా: భారత వెయిట్‌లిఫ్టర్‌ రాఖీ హల్దర్‌ (64కేజీలు) మరోసారి సత్తాచాటి, జాతీయ సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో  స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం ఇక్కడ జరిగిన పోటీ లో హల్దర్‌(బెంగాల్‌) 210కేజీలు(స్నాచ్‌లో 93+ జెర్క్‌లో 117) ఎత్తి ప్రథమ స్థానంలో నిలువగా.. 200కేజీలతో రెండో స్థానం దక్కించుకున్న హర్జిందర్‌ కౌల్‌(ఛత్తీస్‌గఢ్‌) రజతం సాధించింది. గతేడాది జరిగిన ఖతార్‌ ఇంటర్నేషనల్‌ కప్‌లో 218కేజీలు ఎత్తి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన రైల్వే ఉద్యోగిని రాఖీ కాంస్యంతో మెరిసింది. 2019 కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లోనూ ఆమె స్వర్ణం సాధించి సత్తాచాటిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌ అర్హత జాబితాలో రాఖీ ప్రస్తుతం 19వ స్థానంలో ఉంది. 


logo