గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Jul 29, 2020 , 11:54:56

క్రికెట్‌కు రజత్‌ భాటియా వీడ్కోలు

క్రికెట్‌కు రజత్‌ భాటియా వీడ్కోలు

న్యూఢిల్లీ: ఢిల్లీ రంజీ క్రికెటర్,‌  ఐపీఎల్‌ విజేత రజత్‌ భాటియా బుధవారం ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌  అవుతున్నట్లు ప్రకటించాడు.  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో భాటియా 6,482 పరుగులు చేయడంతో పాటు  137 వికెట్లు పడగొట్టాడు. 2008లో  రంజీ ట్రోఫీ టైటిల్‌ విజేతగా నిలిచిన జట్టులో రజత్‌ ఉన్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో ఫైనల్‌లో 139 పరుగులతో  అజేయంగా నిలిచాడు.  తమిళనాడు తరఫున 1999-2000 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 

2012లో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లోనూ భాటియా ఉన్నాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 95 ఐపీఎల్‌  మ్యాచ్‌లు ఆడాడు.    తొలి ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.


logo