బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 20:27:36

రాజస్థాన్‌ రాయల్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా షేన్‌ వార్న్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా షేన్‌ వార్న్‌

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)  ఫ్రాంఛైజీ  రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఆస్ట్రేలియా  దిగ్గజం  షేన్‌ వార్న్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఆ జట్టుకు లెగ్‌స్పిన్నర్‌ వార్న్‌ మెంటార్‌గా నియమితులయ్యాడు.  వార్న్‌ సారథ్యంలో  రాజస్థాన్‌  రాయల్స్‌ జట్టు ఆరంభ ఐపీఎల్‌ సీజన్‌  2008లో ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది.

జట్టులోని యువ ఆటగాళ్లకు వార్న్‌ మార్గనిర్దేశనం  చేయడానికి ఫ్రాంఛైజీ టైటిల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ను మళ్లీ ఆహ్వానించింది.  షేన్‌ వార్న్‌ ఇవాళ 51వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు.  2011 వరకు రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన లెజండరీ క్రికెటర్‌  ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.logo