బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 20, 2020 , 01:22:45

పానీపూరి టు కరోడ్‌పతి

పానీపూరి టు కరోడ్‌పతి

  • ఐపీఎల్‌ వేలంలో రూ.2.4కోట్లు దక్కించుకున్న యశస్వి 
  • రాజస్థాన్‌ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధం 

న్యూఢిల్లీ:  క్రికెటర్‌ అవ్వాలన్న కలను సాకారం చేసుకునేందుకు ముంబైలో పానీపూరిలు అమ్ముకుంటూ.. ఉండేందుకు ఆశ్రయం లేక ప్లాట్‌ఫామ్‌లపై నిద్రపోయిన యశస్వి జైశ్వాల్‌ ఐపీఎల్‌తో కోటీశ్వరుడయ్యాడు. శిక్షణ సమయంలో ముంబైలోని ఓ స్టేడియం టెంట్‌ నీడలోనే పడుకొని.. కఠోన సాధన చేసి.. జూనియర్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందాడు. అండర్‌-19తో పాటు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన 18ఏండ్ల ప్రతిభావంతుడైన యశస్వి జైస్వాల్‌ను గతేడాది ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు రూ.2.4కోట్లకు తీసుకుంది. విజయ్‌ హజారే ట్రోఫీలో ద్విశతకం బాది లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఆ ఫీట్‌ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన యశస్వి.. ఈ ఏడాది జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై శకతంతో కదం తొక్కడం సహా టోర్నమెంట్‌లో టాప్‌ స్కోరర్‌(400)గా నిలిచి.. భారత్‌ ఫైనల్‌ చేరడంలో ప్రధానపాత్ర పోషించాడు. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ పోటీ పడి మరీ రూ.2.4కోట్లకు యశస్విని దక్కించుకుంది.  ఈ నెల 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో యశస్వి తొలిసారి ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. 


logo