మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 27, 2020 , 19:10:35

IPL 2020: పంజాబ్‌పై ఫీల్డింగ్‌ ఎంచుకున్న స్టీవ్‌ స్మిత్‌

 IPL 2020: పంజాబ్‌పై ఫీల్డింగ్‌ ఎంచుకున్న స్టీవ్‌ స్మిత్‌

షార్జా: ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర సమరం ఆరంభమైంది.  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌కు దూరమైన రాజస్థాన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ జట్టులోకి వచ్చాడు.యువ ఓపెనర్‌ జైశ్వాల్‌ స్థానంలో బట్లర్‌, డేవిడ్‌ మిల్లర్‌ స్థానంలో అంకిత్‌ రాజ్‌పుత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు స్మిత్‌ చెప్పాడు. మరోవైపు యూనివర్స్‌ బాస్‌, విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌గేల్‌కు పంజాబ్‌ టీమ్‌లో చోటు దక్కలేదు. గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడిన రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమయ్యాయి.   


logo