సోమవారం 23 నవంబర్ 2020
Sports - Oct 30, 2020 , 19:08:46

KXIP vs RR: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న స్టీవ్‌ స్మిత్‌

KXIP vs RR: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న స్టీవ్‌ స్మిత్‌

అబుదాబి: ఐపీఎల్‌-13లో శుక్రవారం రసవత్తర పోరు జరగనుంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.  పాయింట్ల పట్టికలో పంజాబ్‌ నాలుగో స్థానంలో ఉండగా రాజస్థాన్‌ ఏడో స్థానంలో నిలిచింది.  టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 

తన చివరి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ గెలవాల్సి ఉంది.  రాజస్థాన్‌కు ఇది చావోరేవో మ్యాచ్‌. పంజాబ్‌తో పోరులో రాజస్థాన్‌  ఓడితే ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. వరుసగా ఐదు విజయాలతో కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని పంజాబ్‌ ఫుల్‌జోష్‌లో ఉంది. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు సమిష్టి  ప్రదర్శన చేస్తున్నారు.  వరుసగా ఆరో విజయంపై కన్నేసిన ఆ జట్టు ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో  గెలిచి   నెట్‌రన్‌రేట్‌ను   మెరుగుపరచుకోవాలని    ఆశిస్తోంది.