శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 14:16:51

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫీల్డింగ్ కోచ్‌కు క‌రోనా పాజిటివ్‌

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫీల్డింగ్ కోచ్‌కు క‌రోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీల్)కు ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ఎదురుదెబ్బ త‌గిలింది. యూఏఈకి ప‌య‌న‌మ‌వ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న వేళ జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ య‌గ్నిక్ క‌రోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో ఆయ‌న 14 రోజుల‌పాటు స్వీయ నిర్బంధంలో ఉండ‌నున్నారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని, గ‌త ప‌ది రోజులుగా త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించ‌కోవాల‌ని దిశాంత్ ట్విట‌ర్ ద్వారా కోరారు. బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను రెండు వారాల‌పాటు క్వారంటైన్ ఉంటున్నానని తెలిపారు. యూఏఈలోని జ‌ట్టుతో క‌ల‌వ‌డానికి ముందు రెండు సార్లు క‌రోనా నెగెటివ్ రావాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

 

దిశాంత్‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ ఫ్రాంచైజీ నిర్ధారించింది. ఆయ‌న‌ ప్ర‌స్తుతం సొంతూరు ఉద‌య్‌పూర్‌లో ఉన్నార‌ని, ఆయ‌న‌తో ఏ ఒక్క ఆట‌గాడు కాంటాక్ట్ అవ్వ‌లేద‌ని వెల్ల‌డించింది. వ‌చ్చే వారంలో జ‌ట్టు సభ్యులంతా ముంబైకి చేరుకోనున్న నేప‌థ్యంలో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వహించారు. ఇందులో దిశాంత్‌కు పాజిటివ్ వ‌చ్చింది. అదేవిధంగా జ‌ట్టు యూఏఈకి వెళ్లేకంటే ముందే బోర్డు నిబంధ‌న ప్ర‌కారం మ‌రో రెండు సార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ద‌ని, అందులో అంద‌రికీ నెగెటివ్ రావాల్సి ఉంటుంద‌ని ఫ్రాంచైజీ ప్ర‌క‌టించింది. 


logo