శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 11:30:28

క‌రోనా నుంచి కోలుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫీల్డింగ్ కోచ్

క‌రోనా నుంచి కోలుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫీల్డింగ్ కోచ్

న్యూఢిల్లీ: ‌రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫీ‌ల్డింగ్ కోచ్ దిశాంత్ య‌గ్నిక్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో ఐపీఎల్ వేదికైన దుబాయ్‌కి ఈరోజు ఉద‌యం చేరుకున్నాడు. య‌గ్నిక్‌కు ఆగ‌స్టు 12న క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో 14 రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత‌, రెండుసార్లు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ వ‌చ్చింది. దీంతో శుక్ర‌వారం రాత్రి యూఏఈ బ‌య‌ల్దేరాడు. 

అయితే త‌న జ‌ట్టుతో క‌ల‌వ‌డానికి కంటే ముందు అత‌డు మ‌రో ఆరు రోజుపాటు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాల్సి ఉంది. అదేవిధంగా టోర్నీ ప్రారంభానికి ముందు మూడుసార్లు క‌రోనా నెగెటివ్‌గా నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన టోర్నీల్లో ఒక‌టైన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ సెప్టెంబ‌ర్ 19న ప్రారంభంకానుంది. ఈ టోర్నీ వేదికైన యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని మూడు న‌గ‌రా‌ల్లో జ‌ర‌గ‌నుంది.  


logo