సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 28, 2021 , 01:53:12

చివరి బంతికి సిక్సర్‌తో..

చివరి బంతికి సిక్సర్‌తో..

  • బరోడాను గెలిపించిన సోలంకి.. సెమీస్‌లో రాజస్థాన్‌ 

అహ్మదాబాద్‌: విష్ణు సోలంకి (46 బంతుల్లో  71నాటౌట్‌; 4ఫోర్లు, 5 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్‌తో  పాటు చివరి బంతికి సిక్సర్‌ బాది బరోడాను సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో సెమీస్‌ ఫైనల్‌కు చేర్చాడు. సోలంకి విజృంభణతో బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో  బరోడా 8 వికెట్ల తేడాతో హర్యానాపై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చివరి మూడు బంతులకు 15 పరుగులు చేయాల్సి ఉండగా అప్పటికే అర్ధశతకం చేసిన సోలంకి 6, 4, 6 బాది బరోడాను గెలిపించాడు. మరో క్వార్టర్స్‌లో రాజస్థాన్‌ 16 పరుగుల తేడాతో బీహార్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో బీహార్‌ 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులే చేయగలిగింది. 

VIDEOS

logo