బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 30, 2020 , 22:20:04

RR vs KKR: రాజస్థాన్‌ టాపార్డర్‌ ఢమాల్‌..

RR vs KKR: రాజస్థాన్‌ టాపార్డర్‌ ఢమాల్‌..

దుబాయ్:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌  ఆరంభంలోనే నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నది.  కోల్‌కతా పేసర్లు పదునైన బంతులతో రాజస్థాన్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చారు.  కమిన్స్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(3) వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్‌ యువ పేసర్‌ శివమ్‌ మావి బౌలింగ్‌లో  మిడ్‌వికెట్‌లో నరైన్‌కు క్యాచి ఇచ్చి   ఔటయ్యాడు.   

ఫామ్‌లో ఉన్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరడంతో రాజస్థాన్‌ ఒత్తిడిలో పడింది. జోస్‌ బట్లర్‌, రాబిన్‌ ఉతప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలని భావించారు. పవర్‌ప్లేలో  రాజస్థాన్‌ 2 వికెట్లు కోల్పోయి  39 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌ మొదటి బంతికే ప్రమాదకర బట్లర్‌ను యంగ్‌గన్‌ మావి ఔట్‌ చేసి మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు.  తర్వాతి ఓవర్‌ తొలి బంతికే ఉతప్పను నాగర్‌కోటి పెవిలియన్‌ పంపి  రాజస్థాన్‌కు ఊహించని షాకిచ్చాడు.


logo