మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 10, 2020 , 00:44:34

ఫెన్సింగ్‌ను పోలీసు క్రీడల్లో చేర్చండి

ఫెన్సింగ్‌ను పోలీసు క్రీడల్లో చేర్చండి

  • మంత్రి కేటీఆర్‌కు ఫెన్సింగ్‌ సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి వినతి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పోలీసు క్రీడా విభాగంలో ఫెన్సింగ్‌ను చేర్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావును ఆ క్రీడా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి కోరారు. గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన రాజశేఖర్‌ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఒలింపిక్స్‌ స్థాయి క్రీడ అయిన ఫెన్సింగ్‌కు ప్రాధాన్యమివ్వడం వల్ల మరింత మంది ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా పోలీసు క్రీడల్లో చేర్చడం ద్వారా ఔత్సాహిక ఫెన్సర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దవచ్చన్నారు. దీనికి తోడు గ్రామాల నుంచి ప్రతిభ కల్గిన క్రీడాకారులను గుర్తించి శిక్షణనిస్తామని రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు క్రీడా విభాగంలో ఫెన్సింగ్‌ను చేర్చేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఈ వినతిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌..డీజీపీ మహేందర్‌ రెడ్డితో మాట్లాడి ఫెన్సింగ్‌కు తగిన ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. logo