మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 15:17:03

రైనా స్థానంలో డేవిడ్ మ‌ల‌న్‌?

రైనా స్థానంలో డేవిడ్ మ‌ల‌న్‌?

సెప్టెంబ‌ర్ 19న క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల సీఎస్‌కే స్టార్ ప్లేయ‌ర్ ఈ ఏడాది జ‌ట్టుకు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే రైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు జ‌ట్టు ఫ్రాంచైజీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. సురేశ్ రైనా టీమ్ నుంచి తప్పుకుని దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. అతడి స్థానాన్ని భర్తీ చేయని చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మల‌‌న్‌ను తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ఇటీవల పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో పరుగుల వరద పారించిన మలన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానానికి దూసుకెళ్లాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo