మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 30, 2020 , 01:54:22

కేంద్ర మంత్రి రిజిజుతో రైనా భేటీ

 కేంద్ర మంత్రి రిజిజుతో రైనా భేటీ

న్యూఢిల్లీ: అన్ని క్రీడల్లో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుండడం అద్భుతమైన విషయమని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌  సురేశ్‌ రైనా పేర్కొన్నాడు. దేశంలో క్రీడాభివృద్ధి గురించి కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో రైనా గురువారం ఇక్కడ సమావేశమయ్యాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. ‘కిరణ్‌ రిజిజుతో సమావేశం అద్భుతంగా సాగింది. క్రీడల గురించి మా మధ్య మంచి చర్చ జరిగింది. మన దేశం అన్ని క్రీడల్లో వేగంగా పురోగతి సాధిస్తుండడం గొప్ప విషయం’ అని రైనా రాసుకొచ్చాడు. అలాగే జమ్ముకశ్మీర్‌లో క్రికెట్‌ అకాడమీ ఏర్పాటు గురించి గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో రైనా గత నెలలో సమావేశమైన సంగతి తెలిసిందే.