శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 22:54:26

భార్య‌కు ప్రేమ‌తో..

 భార్య‌కు ప్రేమ‌తో..

న్యూఢిల్లీ:  చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు సురేశ్ రైనా.. త‌న భార్య, పిల్ల‌ల పేర్ల‌ను చేతి ప‌చ్చ‌బొట్టేయించుకున్నాడు. ఐపీఎల్ 13వ సీజ‌న్ ఆడేందుకు యూఏఈ వెళ్ల‌నున్న రైనా.. కుటుంబ స‌భ్యుల‌తో దూరంగా ఉండాల్సి రానుండ‌టంతో.. ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో కుటుంబ స‌భ్యుల‌ను దుబాయ్‌కు తీసుకెళ్ల‌కూడ‌ద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. 

2016లోనే త‌న కూతురు గ్రేసియా పేరును టాటూ వేయించుకున్న రైనా.. తాజాగా భార్య ప్రియంక‌, ఇటీవ‌లే జ‌న్మించిన కొడుకు రియో పేర్ల‌ను చేతుల‌పై ప‌చ్చ‌బొట్లు వేయించుకున్నాడు. ఈ ఫొటోల‌ను రైనా మంగ‌ళ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌లో డాడీస్ ఆర్మీగా ముద్ర‌బ‌డ్డ చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ సారి వారి కుటుంబ స‌భ్యుల సంద‌డి క‌నిపించ‌క‌పోవ‌డం నిరాశే చెందే అంశ‌మ‌ని అభిమానులు అంటున్నారు.


logo