బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 28, 2020 , 13:13:29

ఐపీఎల్‌లో సెన్షేష‌న్‌.. ఎవ‌రీ తివాటియా ?

ఐపీఎల్‌లో సెన్షేష‌న్‌.. ఎవ‌రీ తివాటియా ?

0, 1, 0, 0, 0, 1, 1, 1, 1, 0, 0, 0, 0, 0, 1, 1, 1, 0, 0, 6, 0, 2, 1, 6, 6, 6, 6, 0, 6, 6, 0 (వికెట్‌)

హైద‌రాబాద్ : ఇది రాహుల్ తివాటియా ఇన్నింగ్స్‌.  కింగ్స్ లెవ‌న్ పంజాబ్ బౌల‌ర్ల‌ను రాజ‌స్థాన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ తివాతియా ఎదుర్కొన్న తీరు ఇది.  తివాటియా ఇప్పుడో సెన్సేష‌న్‌.  ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత‌ను స్థానం సంపాదించుకున్నాడు.  పంజాబ్ విసిరి 224 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ చేధించింది. దానికి తివాటియానే ప్ర‌ధాన కార‌ణం. ఆదివారం రాత్రి షార్టాలో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తివాటియా స్ట‌న్నింగ్ బ్యాటింగ్‌ను ప్ర‌ద‌ర్శించాడు.  భారీ స్కోర్‌ను చేధించేందుకు.. హ‌ర్యానాకు చెందిన స్పిన్న‌ర్ రాహుల్ తివాటియాను బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో నాలుగ‌వ స్థానంలోకి దింపారు. ఆ ఎత్తుగ‌డ అంద‌ర్నీ షాక్‌కు గురి చేసింది. పెద్ద పెద్ద ప్లేయ‌ర్లు ఉన్నా.. తివాటియాను ఎందుకు ముందు ఆర్డ‌ర్‌లో పంపారో ఎవ‌రికీ అర్థం కాలేదు.   

తొలుత 19 బంతుల్లో కేవ‌లం 8 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు తివాటియా.  ఆ త‌ర్వాత త‌న ఇన్నింగ్స్‌లో తొలి సిక్స‌ర్ కొట్టాడు. ఇక రాజ‌స్థాన్ చేతుల్లోంచి మ్యాచ్ చేజారుతుంద‌న్న త‌రుణంలో తివాటియా త‌న స‌త్తా చాటాడు.  ఒక్క‌సారిగా త‌న బ్యాటింగ్ ప‌వ‌ర్ చూపించాడు.  కాట్ర‌ల్ వేసిన ఓ ఓవ‌ర్‌లో ఏకంగా అయిదు సిక్స‌ర్లు బాదాడు.  భారీ షాట్ల‌తో హోరెత్తించిన తివాటియా.. కింగ్స్ లెవ‌న్ పంజాబ్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చాడు.  బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో రాబిన్ ఊత‌ప్ప ముందు వ‌రుస‌లో ఉన్నా.. తివాటియాను దింప‌డం కొంత టెన్ష‌న్ పుట్టించింది.  తివాటియా ఆరంభం న‌త్త‌న‌డ‌క‌లా సాగింది. 10 బంతుల్లో 5 ర‌న్స్ చేశాడు.  16 బంతుల్లో 7కు చేరుకుంది అత‌ని స్కోర్‌. ఆ త‌ర్వాత 21 బంతుల్లో 14కు మారింది.  23 బంతుల్లో 17 ర‌న్స్ స్కోర్ చేసి ఇక ఆశ‌లు గ‌ల్లంతు అయిన‌ట్లే అని భావించేలా చేశారు. 

టార్గెట్ భారీగా ఉన్నా తివాటియా మాత్రం తొలుత భారీ షాట్ల‌కు వెళ్ల‌లేదు. కానీ 18వ ఓవ‌ర్‌లో విండీస్ స్పీడ్‌స్ట‌ర్ షెల్డ‌న్ కాట్ర‌ల్ వేసిన బౌలింగ్‌లో చిచ్చ‌ర‌పిడుగులా మారాడు. కాట్ర‌ల్‌కు చుక్క‌లు చూపించాడు. విండీస్ బౌల‌ర్‌ను న‌లువైపులా  కొట్టాడు. ఆ ఓవ‌ర్‌లో అయిదు సిక్స‌ర్లు కొట్టిన తివాటియా.. 29 బంతుల్లో 47 ర‌న్స్ చేసి మొత్తం మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడు. 31 బంతుల్లో 53 ర‌న్స్ చేయాల్సిన ప‌రిస్థితి నుంచి 23 బంతుల్లో 17 ర‌న్స్ టార్గెట్‌కు రాజ‌స్థాన్‌కు తివాటియా తీసుకువెళ్లాడు. 

1993లో తివాటియా జ‌న్మించాడు.  2013లో ఫ‌స్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.  మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచ్‌లు ఆడాడు.  హ‌ర్యానా త‌ర‌పున అత‌ను ఎక్కువ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వ‌హించాడు.  అత్య‌ధికంగా 91 ర‌న్స్ చేశాడు.  2014లో రాయ‌ల్స్ త‌ర‌పున, 2017లో కింగ్స్ లెవ‌న్ పంజాబ్ త‌ర‌పున‌, 2018లో ఢిల్లీడేర్‌డెవిల్స్ త‌ర‌పున ఆడాడు.   


logo