సోమవారం 23 నవంబర్ 2020
Sports - Nov 01, 2020 , 20:32:31

కోల్‌కతాకు షాక్‌.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

కోల్‌కతాకు షాక్‌.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

దుబాయ్‌: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌  నిలకడగా ఆడుతోంది.    రాజస్థాన్‌ ధాటికి కోల్‌కతా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్‌ తెవాటియా వేసిన 9వ ఓవర్లో  సూపర్‌ ఫామ్‌లో ఉన్న  శుభ్‌మన్‌ గిల్‌(36)తో పాటు అప్పుడే క్రీజులోకి వచ్చిన సునీల్‌ నరైన్‌(0) ఔటవడంతో కోల్‌కతాపై ఒత్తిడి పెరిగింది. భారీ షాట్‌కు యత్నించిన గిల్‌..బట్లర్‌ చేతికి చిక్కాడు.

అదే ఓవర్‌లో నరైన్‌ షాట్‌కు ప్రయత్నించి బెన్‌స్టోక్స్‌ చేతికి చిక్కాడు.  క్రీజులో కుదురుకున్న రాహుల్‌ త్రిపాఠి(39) కూడా శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.    ప్రస్తుతం  కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(15) క్రీజులో ఉన్నాడు. 12 ఓవర్లకు కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 94 రన్స్‌ చేసింది.