గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 05, 2021 , 08:03:35

ఇంటివాడు కాబోతున్న మ‌రో క్రికెట‌ర్‌..!

ఇంటివాడు కాబోతున్న మ‌రో క్రికెట‌ర్‌..!

సినిమా సెల‌బ్రిటీలే కాదు ఇండియ‌న్ క్రికెట‌ర్స్  కూడా వ‌రుస‌గా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఈ ఏడాది భార‌త ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ వివాహం చేసుకోగా, రీసెంట్‌గా టీమ్‌ఇండియా పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో  రినీ    మెడలో మూడు ముళ్లు వేశాడు. ఫిబ్రవరి 2న వివాహం జరిగింది. క‌రోనా వ‌ల‌న కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో  పెళ్లి చేసుకున్నాడు.

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆల్‌రౌండ‌ర్ రాహుల్ తెవాటియా బుధ‌వారం రోజు ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకోగా, గురువారం రోజు ఆ వేడుక సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ జంట‌కు నెటిజ‌న్స్‌తో పాటు ప‌లువురు క్రికెట‌ర్స్ విషెస్ తెలియ‌జేస్తున్నారు. భార‌త మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా కంగ్రాట్యులేష‌న్స్ బ్ర‌ద‌ర్ అని కామెంట్ పెట్టాడు. వ‌చ్చే నెల‌లో తెవాటియా పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

VIDEOS

logo