శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 23, 2020 , 20:22:59

43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన చెన్నై

43  పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన చెన్నై

షార్జా:  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో  మొదట బ్యాటింగ్‌ చేస్తున్న  చెన్నై సూపర్‌ కింగ్స్‌  అతి తక్కువ స్కోరుకే బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు.   టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ముంబై బౌలర్ల ధాటికి రుతురాజ్‌ గైక్వాడ్(0), డుప్లెసిస్‌(1), అంబటి రాయుడు(2), జగదీశన్‌(0), మహేంద్ర సింగ్‌ ధోనీ(16),  జడేజా(7), దీపక్‌ చాహర్‌(0) పెవిలియన్‌ బాట పట్టారు. 

ముంబై బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ మూడు  వికెట్లు తీయగా, బుమ్రా, రాహుల్‌ చాహర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 9 ఓవర్లకు చెన్నై 7 వికెట్లు కోల్పోయి 44 పరుగులే చేసింది. శామ్‌ కరన్‌, శార్దుల్‌ ఠాకూర్‌ క్రీజులో ఉన్నారు.