బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 00:31:27

వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌

వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌

  • ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్ల ఎంపిక
  • రోహిత్‌, భువనేశ్వర్‌ను పరిగణనలోకి తీసుకోని సెలెక్టర్లు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. ఐపీఎల్‌లో కండరాల గాయం వల్ల గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్‌ శర్మతో పాటు స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను సునీల్‌ జోషి నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో లోకేశ్‌ రాహుల్‌ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రోహిత్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకోగా.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున అదరగొడుతున్న లెగ్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. కొవిడ్‌-19 నేపథ్యంలో బయో బబుల్‌ను దృష్టిలో పెట్టుకొని సెలెక్షన్‌ కమిటీ జంబో జట్లను ప్రకటించింది. ఐపీఎల్‌ అనంతరం సిడ్నీ వెళ్లనున్న భారత జట్టు అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి నవంబర్‌ 27న తొలి వన్డే ఆడనుంది.

వన్డే జట్టు

కోహ్లీ (కెప్టెన్‌), ధావన్‌, మయాంక్‌, గిల్‌, కేఎల్‌ రాహుల్‌, అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, జడేజా, చాహల్‌, కుల్దీప్‌, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్‌.

టీ20 జట్టు

కోహ్లీ (కెప్టెన్‌), ధావన్‌, మయాంక్‌, కేఎల్‌ రాహుల్‌, అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, సంజూ శాంసన్‌, జడేజా, సుందర్‌, చాహల్‌, బుమ్రా, షమీ, సైనీ, దీపక్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి

టెస్టు జట్టు

కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ షా, రాహుల్‌, పుజారా, రహానే, విహారి, గిల్‌, సాహా, పంత్‌, బుమ్రా, షమీ, ఉమేశ్‌, సైనీ, కుల్దీప్‌, జడేజా, అశ్విన్‌, సిరాజ్‌

తొలి వన్డే నవంబర్‌ 27 సిడ్నీ

రెండో వన్డే నవంబర్‌ 29 సిడ్నీ

మూడో వన్డే డిసెంబర్‌ 1 ఓవల్‌

తొలి టీ20 డిసెంబర్‌ 4 ఓవల్‌

రెండో టీ20 డిసెంబర్‌ 6 సిడ్నీ

మూడో టీ20 డిసెంబర్‌ 8 సిడ్నీ


టెస్టు-1 డిసెంబర్‌ 17-21 అడిలైడ్‌

టెస్టు-2 డిసెంబర్‌ 26-30 మెల్‌బోర్న్‌

టెస్టు-3 జనవరి 7-11 సిడ్నీ

టెస్టు-4 జనవరి 15-19 బ్రిస్బేన్‌