శనివారం 16 జనవరి 2021
Sports - Dec 06, 2020 , 14:55:55

ఓపెనర్లు డకౌట్‌..రహానె సెంచరీ

ఓపెనర్లు డకౌట్‌..రహానె సెంచరీ

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు  నిర్వహిస్తున్న తొలి వార్మప్‌ మ్యాచ్‌లో రహానె సారథ్యంలోని భారత-ఏ జట్టులో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రాణించారు.  కెప్టెన్‌ రహానె(108: 228 బంతుల్లో 16ఫోర్లు, సిక్స్‌) శతకంతో జట్టును ఆదుకోగా టెస్టు స్పెషలిస్ట్‌ చెతేశ్వర్‌ పుజారా(54: 140 బంతుల్లో 5ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు.  వీరిద్దరు మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో ఆదివారం ఆట ముగిసేసమయానికి 90 ఓవర్లలో భారత్‌ 8 వికెట్లకు 237 పరుగులు చేసింది.  యువ ఓపెనర్లు పృథ్వీ షా(0), శుభ్‌మన్‌ గిల్‌(0) డకౌట్‌గా వెనుదిరిగారు.

హనుమ విహారి(15: 51 బంతుల్లో 2ఫోర్లు), వృద్ధిమాన్‌ సాహా(0) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. రహానె, పుజారా నాలుగో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  40/3తో కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడీ ఆదుకున్నది.  ఆస్ట్రేలియా-ఏ జట్టు బౌలర్లలో జేమ్స్‌ పాటిన్సన్‌ మూడు వికెట్లు తీయగా.. మైఖేల్‌ నేజర్‌, ట్రావీస్‌ హెడ్‌ రెండు వికెట్లు తీశారు. హెడ్‌ ఆసీస్‌ జట్టుకు సారథిగా వ్యవహరించాడు.