శనివారం 30 మే 2020
Sports - Apr 07, 2020 , 19:53:08

నా ఫేవరెట్ ఇన్నింగ్స్​లు అవే: రహానే

నా ఫేవరెట్ ఇన్నింగ్స్​లు అవే: రహానే

ముంబై: కెరీర్​లో రెండు ఇన్నింగ్స్​లు అంటే తనకెంతో ఇష్టమని టీమ్​ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే చెప్పాడు. 2014లో లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన టెస్టులో 103 పరుగులు సహా 2015 ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికాపై 79పరుగులు చేసిన ప్రదర్శనలు తనకు ఫేవరెట్​ అని చెప్పాడు. ట్విట్టర్​లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు జింక్స్ సమాధానాలిచ్చాడు.

2014 లార్డ్స్ టెస్టులో జట్టు సభ్యులు ఇబ్బందులు పడిన పిచ్​పై రహానే తొలి ఇన్నింగ్స్​లో అద్భుతంగా  ఆడాడు. ఓ దశలో భువనేశ్వర్ కుమార్​తో కలిసి 90పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 154 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. దీంతో 28ఏండ్ల తర్వాత ప్రతిష్ఠాత్మక లార్డ్స్​ మైదానంలో భారత్.. ఇంగ్లండ్​పై విజయం సాధించింది. ఆ తర్వాతి ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్​లో రహానే దూకుడుగా ఆడాడు. ధవన్ శతకం సహా 60 బంతుల్లోనే జింక్య్ 79 పరుగులు చేయడంతో భారత్​ 7వికెట్లకు 307పరుగులు చేసింది. ఆ తర్వాత అశ్విన్ స్పిన్​మాయాజం ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా 177పరుగులకే ఆలౌటైంది. 


logo