మంగళవారం 07 జూలై 2020
Sports - Apr 22, 2020 , 19:04:29

అండ‌ర్స‌న్‌ను ఎదుర్కోవ‌డం క‌ష్టం: ర‌హానే

అండ‌ర్స‌న్‌ను ఎదుర్కోవ‌డం క‌ష్టం: ర‌హానే


న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గ‌డ్డ‌పై జేమ్స్ అండ‌ర్స‌న్‌ను ఎదుర్కోవ‌డం అన్నిటికంటే క‌ష్ట‌మైన విష‌యం అని టీమ్ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానే పేర్కొన్నాడు. వాతావ‌ర‌ణాన్ని అనుకూలంగా మ‌లుచుకుంటూ బంతులేయ‌డంలో జెమ్మీ నేర్ప‌రి అని ర‌హ‌నే అన్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆట‌గాళ్లు మాన‌సికంగా ధృడంగా ఉండ‌టం చాలా ముఖ్య‌మ‌ని జింక్స్ అన్నాడు.

`ఇంగ్లిష్ కండీష‌న్స్‌లో అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో ఆడ‌టం చాలా క‌ష్టం. సొంత గ‌డ్డ‌పై ఎలాంటి బంతులేయాలో అత‌డికి బాగా తెలుసు. కొవిడ్‌-19 కార‌ణంగా ల‌భించిన ఈ విరామంలో ఆట‌గాళ్లు మాన‌సికంగా ధృడంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌తీ ఒక్క‌రూ ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వ‌డం మంచింది` అని ర‌హానే అన్నాడు.


logo