సూపర్ సూరారై పొట్రూ.. అజింక్య రహానె

చెన్నై : భారత క్రికెటర్ అజింక్య రహానె ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడటానికి చెన్నైలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ప్రశ్నోత్తరాల సమావేశాన్ని నిర్వహించిన రహానె.. తమిళ చిత్రం సూరారై పొట్రు సినిమాను తాను చూశానని, చిత్రం సూపర్‌గా ఉన్నదని వెల్లడించారు. తనకు తమిళం రాకపోవడం వల్ల సబ్ టైటిల్స్‌తో అర్ధం చేసుకున్నానని.. ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సూరారై పొట్రు సినిమాలో హీరో సూర్య నటన అద్భుతంగా ఉన్నదని, సినిమాలో లీనమైపోయి అలాగే చూస్తూ ఉండిపోయానని తెలిపారు. దక్షిణాది సినిమాలు వైవిద్యంగా ఉంటాయని, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాయని రహానె చెప్పారు. పలు విషయాలపై అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో అజింక్య సమాధానాలు ఇచ్చారు.
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అజింక్య రహానె అందరి హృదయాలను గెలుచుకున్నారు. తన తదుపరి సిరీస్‌ను ఇంగ్లండ్‌తో ఆడటానికి ఇటీవలనే చెన్నైకి వచ్చారు. ఇంగ్లండ్‌తో తొలి, రెండవ టెస్టు మ్యాచులు చెన్నైలో జరుగుతాయి. మ్యాచులకు ముందు చెన్నైలో నిర్బంధంలో కొనసాగారు. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రశ్నోత్తరాల సమావేశాన్ని నిర్వహించారు. అతడి అభిమానుల్లో ఒకరు, "చెన్నైకి స్వాగతం, ఎప్పుడైనా ఏదైనా తమిళ సినిమా లేదా సిరీస్ చూసారా? " అని అడగ్గా.. ఠకీమని మొన్నే సూరరై పొట్రు సినిమా చూశానని, సూపర్‌గా ఉందని జవాబిచ్చారు. ఈ సినిమాను చాలా ఇష్టపడ్డానని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్
- రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా