బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 15, 2021 , 15:27:06

రెండో టెస్టు: అశ్విన్‌ అద్భుత శతకం

రెండో టెస్టు: అశ్విన్‌ అద్భుత శతకం

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ ప్లేయర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ శతకంతో మెరిశాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ విఫలమైన  అశ్విన్‌ మాత్రం చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్‌మెన్ తడబడినప్పటికీ అశ్విన్‌  ఇంగ్లీష్‌ బౌలర్లకు  ధీటుగా సమాధానం చెప్పాడు. కష్టంగా మారుతున్న పిచ్‌పై గొప్ప ప్రదర్శన చేశాడు. మొయిన్‌ అలీ వేసిన  82వ ఓవర్లో  ఒక సిక్స్‌, రెండు ఫోర్లు బాది 17 రన్స్‌ రాబట్టి శతకం పూర్తి చేసుకోవడం విశేషం.

సొంతమైదానంలో సెంచరీ చేయడంతో అశ్విన్‌ తనదైన స్టైల్‌లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో అశ్విన్‌కిది ఐదో శతకం కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 83 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది.  ప్రస్తుతం అశ్విన్‌(103), సిరాజ్‌(9) క్రీజులో ఉన్నారు. భారత్‌ 471 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

VIDEOS

logo