బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 03:23:19

ఆ స్వరం ముందు తరాలకు స్ఫూర్తి

ఆ స్వరం ముందు తరాలకు స్ఫూర్తి

చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో యావత్‌ భారతం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన గొంతుక రాబోయే తరాలకు స్ఫూర్తి అంటూ క్రీడాలోకం సంతాపం వ్యక్తం చేసింది. 

ఎస్పీబీ లేరని తెలిసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యా. ఆయన పాటలెప్పుడూ మన హృదయాల్లో నిలిచిపోతాయి. బాలు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. 

-వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఈ ఏడాది రోజు రోజుకు దారుణంగా మారుతున్నది. ఎస్పీబీ ఆత్మకు శాంతి చేకూరాలి.

-రవిచంద్రన్‌ అశ్విన్‌

భారత సినీ దిగ్గజం ఎస్పీబీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆయనతో కలిసి గడిపిన మధుర క్షణాలు మరువలేనివి.

- అనిల్‌ కుంబ్లే

నా తొలి స్పాన్సర్‌, నిగర్వి, స్నేహశీలి ఎస్పీబీ సార్‌ మరణ వార్త నన్ను కలచివేసింది.

- విశ్వనాథన్‌ ఆనంద్‌


logo