మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 16:37:19

MI vs SRH: డికాక్‌ హాఫ్‌సెంచరీ..భారీ స్కోరు దిశగా ముంబై

MI vs SRH: డికాక్‌ హాఫ్‌సెంచరీ..భారీ స్కోరు దిశగా ముంబై

షార్జా: సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌తో జరుగుతోన్న  మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ అర్ధశతకం  సాధించాడు. కేన్‌ విలియమ్సన్‌ వేసిన 12వ ఓవర్లో భారీ సిక్సర్‌ బాది హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు బాదిన డికాక్‌  సీజన్‌లో మొదటి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అతనికిది 11వ హాఫ్‌సెంచరీ.   అబ్దుల్‌ సమద్‌ వేసిన ఏడో ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డికాక్‌ ఆ తర్వాత వేగంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.  మరో ఎండ్‌లో ఇషాన్‌ కిషన్‌ అతనికి సహకారం అందిస్తున్నాడు.  13 ఓవర్లు ముగిసేసరికి ముంబై  2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. డికాక్‌(67), కిషన్‌(23) క్రీజులో ఉన్నారు.