ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 06, 2020 , 22:07:33

డేవిడ్‌ వార్నర్‌ ఔట్‌

 డేవిడ్‌ వార్నర్‌ ఔట్‌

అబుదాబి: ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 132 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలకడగా ఆడుతోంది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ శ్రీవాత్స్‌ గోస్వామీ వికెట్‌ కీపర్‌ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే దూకుడుగా ఆడుతున్నాడు.

క్రీజులో కుదురుకున్న డేవిడ్‌ వార్నర్(17)‌ కూడా  సిరాజ్‌ వేసిన ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్‌లో సిరాజ్‌ అద్భుత బంతికి వార్నర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.  పవర్‌ప్లే ఆఖరికి సన్‌రైజర్స్‌ 2 వికెట్లకు 48 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే(22)కు విలియమ్సన్‌ సహకరిస్తున్నాడు.