శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 16, 2021 , 14:35:30

గ్రాండ్‌స్లామ్ చ‌రిత్ర‌లో అస్ల‌న్ కొత్త రికార్డు

గ్రాండ్‌స్లామ్ చ‌రిత్ర‌లో అస్ల‌న్ కొత్త రికార్డు

మెల్‌బోర్న్‌:  ర‌ష్యా టెన్నిస్ క్రీడాకారుడు అస్ల‌న్ క‌ర‌త్సేవ్ .. కొత్త చ‌రిత్ర లిఖించాడు.  మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సెమీఫైన‌ల్లోకి ప్ర‌వేశించాడ‌త‌ను.  ఓపెన్ ఎరాలో అరంగేట్రం చేసిన గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే సెమీస్‌కు చేరిన తొలి టెన్నిస్ ప్లేయ‌ర్‌గా అస్ల‌న్ రికార్డు క్రియేట్ చేశాడు. క్వాలిఫై ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన అస్ల‌న్‌ 2-6, 6-4, 6-1, 6-2 స్కోర్‌తో దిమిత్రోవ్‌పై విజ‌యం సాధించాడు.  అయితే సెమీస్ పోరులో అత‌ను జోకోవిచ్ లేదా అలెగ్జాండ‌ర్ జెరేవ్‌తో పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. నిజానికి క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో దిమిత్రోవ్ గాయంతో స‌త‌మ‌తం అవుతున్నాడు.  ఆ మ్యాచ్‌లో మెడిక‌ల్ టైమౌట్ తీసుకున్న దిమిత్రోవ్‌.. ర‌ష్యా ఆట‌గాడి ముందు చేతులెత్తేశాడు. ఇది న‌మ్మ‌క‌లేక‌పోతున్నా.. సెమీస్‌కు వెళ్ల‌డం ఇదే తొలిసారి అని క‌ర‌త్సేవ్ అన్నాడు. 1977లో బాబ్ గిల్టిన‌న్ కూడా ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో క్వాలిఫైర్‌గా పోటీలోకి దిగి సెమీస్ వ‌ర‌కు వెళ్లాడు.  114వ ర్యాంక్‌లో ఉన్న అస్ల‌న్‌.. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేర‌డం మ‌రో విశేషం.   ఈ టోర్నీలో 8వ సీడ్ డీగో స్వాట్జ్‌మ్యాన్‌, 20వ సీడ్ ఫెలిక్స్ ఆగ‌ర్ అలిసైమ్‌ల‌ను క‌ర‌త్సేవ్ ఓడించాడు.    

VIDEOS

logo