ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 09:55:10

ఖతా‌ర్‌లో 2032 ఒలింపిక్స్‌..బిడ్‌ దాఖలుకు సన్నాహం!

ఖతా‌ర్‌లో  2032 ఒలింపిక్స్‌..బిడ్‌ దాఖలుకు సన్నాహం!

దోహా: 2032 ఒలింపిక్‌, పారాలింపిక్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వడానికి ఖతార్‌ ఆసక్తి చూపిస్తున్నది.   ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడాసంరంభం ఒలింపిక్స్‌ ఆతిథ్యంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ)కి లేఖరాసింది. గల్ఫ్‌ ప్రాంతంలో తొలిసారిగా విశ్వ క్రీడలను నిర్వహించాలని ఖతారు నిర్ణయించింది.  ఈ ప్రాంతీయ దేశాల్లోనే   మొట్టమొదటిసారిగా ఫిఫా వరల్డ్‌కప్‌ను 2022లో ఇక్కడే నిర్వహించనున్నారు. ఎడారి దేశంలో తీవ్రమైన వేసవి వేడి కారణంగా సాధారణంగా జరిగే జూన్‌-జూలై స్లాట్‌ నుంచి నవంబర్‌-డిసెంబర్‌కు ఫిఫా ప్రపంచకప్‌ను తరలించాల్సి వచ్చింది. 

 ఏడాది పాటు వాయిదా  పడిన టోక్యో ఒలింపిక్స్‌  2021లో జరగనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2024లో పారీస్‌లో..2028లో లాస్‌ ఏంజెలెస్‌లో ఒలింపిక్‌ గేమ్స్‌ జరగనున్నాయి.     విశ్వ క్రీడల  నిర్వహణకు బిడ్‌ దాఖలు చేయదలిస్తే..సెప్టెంబర్‌ 15లోగా అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్యకు  ఆతిథ్య ఆసక్తిని తెలియజేసేందుకు గడువు నిర్దేశించినట్లు తెలిసింది. 


logo