శనివారం 06 మార్చి 2021
Sports - Jan 28, 2021 , 16:58:52

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన సింధు

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన సింధు

బ్యాంకాక్‌: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌  రెండో మ్యాచ్‌లో  భారత స్టార్‌ షట్లర్‌  పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. మహిళల  సింగిల్స్‌ గ్రూప్‌-బిలో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో  ప్రపంచ ఛాంపియన్‌ సింధు 19-21, 13-21తో  రచనోక్‌ ఇంతనాన్‌ (ఇండోనేషియా) చేతిలో పరాజయం పాలైంది. టోర్నీలో సింధు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి గేమ్‌లో ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చిన సింధు రెండో గేమ్‌లో చేతులెత్తేసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రచనోక్‌ వరుసగా రెండు గేమ్‌ల్లో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నది. 

శుక్రవారం జరిగే మూడో మ్యాచ్‌లో సింధు..తక్కువ ర్యాంకు అమ్మాయి పోర్న్‌పావీ చోచువాంగ్‌తో తలపడనుంది.  నలుగురు షట్లర్లున్న  గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన  క్రీడాకారులు తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సింధు  సెమీస్‌ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నది. 

VIDEOS

logo