శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 23, 2021 , 00:27:03

సింధు నిష్క్రమణ

సింధు నిష్క్రమణ

  • థాయ్‌లాండ్‌ ఓపెన్‌ 

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ సింధు 13-21, 9-21 తేడాతో రచానోక్‌ ఇటానోన్‌(థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 13-21, 21-19, 20-22తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అండర్స్‌ అంటోన్‌సెన్‌(డెన్మార్క్‌)పై పోరాడి ఓడాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకీరెడ్డి, అశ్విని పొనప్ప ద్వయం 18-21, 24-22, 22-20తో మలేషియా జోడీ పెంగ్‌సూన్‌, లు యింగ్‌పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.  పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ శెట్టి ద్వయం 21-18, 24-22తో మలేషియా జోడీపై గెలిచింది. 

VIDEOS

logo