గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 02, 2020 , 15:23:54

థామ‌స్ అండ్ ఉబెర్ క‌ప్‌కు సింధు దూరం

థామ‌స్ అండ్ ఉబెర్ క‌ప్‌కు సింధు దూరం

న్యూఢిల్లీ: అక్టోబ‌ర్‌లో డెన్మార్క్‌లో జ‌రుగ‌నున్న థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నమెంట్‌ నుంచి భార‌త  స్టార్ ‌షట్లర్‌ పీవీ సింధు వైదొలగ‌నున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ బుధ‌వారం మీడియాకు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే సింధు ఈ టోర్నీకి దూరమ‌వుతున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. షెడ్యూల్ ప్ర‌కారం డెన్మార్క్‌లోని ఆర్హాస్ న‌గ‌రంలో అక్టోబ‌ర్ 3 నుంచి 11 వరకు థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీ జరుగనుంది.

రాబోయే మ‌రో రెండు టోర్న‌మెంట్‌ల‌కు కూడా సింధు త‌న ఎంట్రీల‌ను పంప‌నున్న‌ద‌ని, అయితే అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆ టోర్నీల్లో ఆడాలా, వ‌ద్దా అనే విష‌యాన్ని నిర్ణ‌యించుకోనున్న‌ద‌ని ర‌మ‌ణ తెలిపారు. అయితే డెన్మార్క్‌లోని ఓడెన్స్‌లో జ‌రుగనున్న బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ సూప‌ర్ 750 టూర్ ఇవెంట్ల‌లో సింధు పాల్గొంటార‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. కాగా, డెన్మార్క్‌లో థామ‌స్ అండ్ ఉబెర్ క‌ప్ టోర్నీ నుంచి వైదొలగాల‌ని తాను నిర్ణ‌యించుకున్న‌ట్లు సింధు బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (బీఏఐ)కు స‌మాచారం కూడా ఇచ్చార‌ని బీఏఐకి చెందిన సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo