సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 08, 2020 , 00:47:10

ఉబర్‌కప్‌లో ఆడుతా: సింధు

ఉబర్‌కప్‌లో ఆడుతా: సింధు

 హైదరాబాద్‌: వ్యక్తిగత కారణాల వల్ల ఉబర్‌ కప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అధ్యక్షుడు హిమంతబిశ్వ శర్మ ప్రోద్బలంతో తాను ఉబర్‌కప్‌లో పాల్గొననున్నట్లు సోమవారం వెల్లడించింది. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉబర్‌ కప్‌ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ హిమంత సార్‌ ఫోన్‌ చేసి మాట్లాడటంతో.. టోర్నీలో పాల్గొనబోతున్నా. జట్టుతో పాటు కాకుండా కాస్త ఆలస్యంగా డెన్మార్క్‌ బయలుదేరుతా’ అని సింధు పేర్కొంది. కొవిడ్‌-19 కోరలు చాస్తుండటంతో ఇప్పటికే చైనీస్‌ తైపీ, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా ఈ టోర్నీ నుంచి తప్పుకోగా.. భారత్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయని బాయ్‌ అధ్యక్షుడు నచ్చచెప్పడంతో సింధు అంగీకరించినట్లు సమాచారం. పలుమార్లు వాయిదా పడ్డ ఉబర్‌కప్‌ అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

తాజావార్తలు


logo