గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 19:40:47

సింధు.. ఇప్పటికే దేశానికి చాలా బహుమతులిచ్చావ్‌:ప్రధాని మోడీ

సింధు.. ఇప్పటికే దేశానికి చాలా బహుమతులిచ్చావ్‌:ప్రధాని మోడీ

న్యూ ఢిల్లీ: ‘పీవీ సింధు మీరు ఇప్పటికే దేశానికి చాలా బహుమతిలిచ్చారు.. మీరు రాబోయే కాలంలో కూడా రాణించగలరని నమ్ముతున్నా..’ అని ప్రధాని మోడీ అన్నారు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సోమవారం ప్రధాని మోడీకి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపింది. ట్విట్టర్‌లో వీడియో పెట్టింది. ఇందులో ఆమె ప్రధానికి శుభాకాంక్షలు తెలుపడంతోపాటు వచ్చే ఏడాది ఈ సమయానికి ఒలింపిక్స్‌ పతకాలు సాధించి దేశానికి మంచి బహుమతి ఇస్తా అని పేర్కొంది.

కాగా, దేశ క్రీడాకారులతో తరుచూ సంభాషించే మోడీ దీనిపై స్పందించారు. ‘రక్షా బంధన్ శుభాకాంక్షలు @ పీవీ సింధు1. మీరు ఇప్పటికే దేశానికి చాలా బహుమతులు ఇచ్చారు. రాబోయే కాలంలో మీరు రాణించగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ వ్యక్తి మీరు.’ అని రీట్వీట్‌ చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo