మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 01, 2020 , 01:30:00

సింధు ఓటమి

సింధు ఓటమి


హైదరాబాద్‌: స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు పరాజయం చెందడంతో సొంతగడ్డపై హైదరాబాద్‌ హంటర్స్‌కు పరాభవం ఎదురైంది. శుక్రవారం  గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన టైలో హైదరాబాద్‌ 0-3 తేడాతో బెంగళూరు రాప్టర్స్‌ చేతిలో ఓడిపోయింది. తొలుత పురుషుల డబుల్స్‌లో పరాజయం ఎదురవగా ... ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న సింగిల్స్‌లోనూ సౌరభ్‌ వర్మ  ఓడిపోవడంతో హంటర్స్‌ ఆదిలోనే మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత  మహిళల సింగిల్స్‌లో కెప్టెన్‌ సింధు 15-11, 13-15, 9-15తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్‌, తై జూ యింగ్‌ చేతిలో ఓడడంతో హైదరాబాద్‌ కష్టాలు మరింత పెరిగాయి. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న మహిళల డబుల్స్‌లో హైదరాబాద్‌ జోడీ ఎన్‌.సిక్కిరెడ్డి - వ్లాదిమర్‌ ఇవనోవ్‌ విజయం సాధించడంతో జట్టు కాస్త కోలుకుంది. ఆ తర్వాతి సాయిప్రణీత్‌ చేతిలో డారెన్‌ లీ ఓడిపోవడంతో హైదరాబాద్‌ 0-3తేడాతో ఓడింది.


logo
>>>>>>