శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 14, 2020 , 00:19:53

మళ్లీ నిరాశే..

మళ్లీ నిరాశే..
  • క్వార్టర్స్‌లో సింధు ఓటమి
  • ఆల్‌ఇంగ్లండ్‌లో ముగిసిన భారత షట్లర్ల పోరాటం

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నీ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు శుక్రవారం 21-12, 15-21, 13-21తో నాలుగో సీడ్‌ నజోమి ఒకుహార (జపాన్‌) చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఆల్‌ఇంగ్లండ్‌ ఓపెన్‌లో భారత్‌ పోరాటం ముగిసినైట్లెంది. గంటా ఎనిమిది నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన తెలుగమ్మాయి.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లు ఓడి క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహారను మట్టికరిపించి విజేతగా నిలిచిన సింధు.. ఈసారి అలాంటి ప్రదర్శన కొనసాగించలేకపోయింది. 


logo