గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 13, 2020 , 00:41:49

సింధు ముందడుగు

సింధు ముందడుగు
  • సైనా, లక్ష్యసేన్‌ నిష్క్రమణ

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-19, 21-15తేడాతో సంగ్‌ జీహ్యున్‌(కొరియా)పై విజయం సాధించింది. తొలి రౌండ్‌ పోటీలో మరో స్టార్‌ షట్లర్‌  సైనా నెహ్వాల్‌  11-21, 8-21 మూడో సీడ్‌ అకానే యమగూచి(జపాన్‌) చేతిలో 28నిమిషాల్లో ఓడి నిరాశ పరిచింది. దీంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఏప్రిల్‌ 28లోగా జరిగే టోర్నీల్లో సైనా తప్పనిసరిగా మెరుగ్గా రాణించాల్సిందే. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో అద్భుత విజయం సాధించిన భారత యువ కెరటం లక్ష్యసేన్‌ ప్రిక్వార్టర్స్‌లో 17-21, 18-21తేడాతో రెండో సీడ్‌ ఆటగాడు విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడాడు. తొలి రౌండ్‌ పోటీలో పారుపల్లి కశ్యప్‌ గాయం కారణంగా కాసేపటికే నిష్క్రమించగా.. ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత బి సాయిప్రణీత్‌ 12-21, 13-21తేడాతో జువా జున్‌పెంగ్‌(చైనా) చేతిలో ఓడాడు.


logo