గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 06, 2020 , 01:08:34

సింధు, సైనాకు సవాలే..

సింధు, సైనాకు సవాలే..
  • ఇండియా ఓపెన్‌ ‘డ్రా’ విడుదల

న్యూఢిల్లీ: కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న భారత షట్లర్లకు సొంతగడ్డపై జరుగనున్న ఇండియా ఓపెన్‌లో కష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ‘డ్రా’ గురువారం విడుదలైంది. 2017 టైటిల్‌ విజేత, ప్రపంచ చాంపియన్‌ సింధు మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో  చెయింగ్‌ గాన్‌ యీ (హాంకాంగ్‌)తో తలపడనుంది. ఆరంభ సవాళ్లు అధిగమించి సింధు క్వార్టర్స్‌ చేరితే..  మిచెలీ లీ (కెనడా) రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురయ్యే చాన్స్‌ ఉంది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా సాగుతున్న 2015 టైటిల్‌ విన్నర్‌ సైనా నెహ్వాల్‌.. తొలి రౌండ్‌లో పైయూ పో (చైనీస్‌ తైపీ)తో తలపడనుంది. 


logo
>>>>>>