గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 03, 2020 , 17:11:25

ప్రధాని మోడీకి పీవీ సింధు రాఖీ శుభాకాంక్షలు

ప్రధాని మోడీకి పీవీ సింధు రాఖీ శుభాకాంక్షలు

న్యూ ఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సోమవారం ప్రధాని నరేంద్రమోడీకి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపింది. తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. ‘గుడ్‌ ఈవ్‌నింగ్‌ సార్‌.. ఈ శుభ దినోత్సవాన మీకు నేను రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీరు దేశం కోసం ఎంతో చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు.’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.  

‘హ్యాపీ రక్షా బంధన్ @ పీఎంఓఇండియా సర్’ అని శీర్షిక పెట్టింది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఈ సమయానికి మీకు బహుమతిగా ఇస్తా అని పేర్కొంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, 2020 టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo